హైదరాబాద్, ఏప్రిల్5 (నమస్తే తెలంగాణ) : సామాజిక న్యాయం, సాధికారతశాఖ ఆధ్వర్యంలో డెహ్రాడూన్‌లో ‘చింతన్ శివిర్’ ఈనెల 7,8న నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్లు, మద్యపాన వ్యసనపరులు, మాదకద్రవ్యాల బాధితులు, లింగమార్పిడి వ్యక్తులు, యాచకులు, మాన్యువల్ స్కావెంజర్స్, సంచార తెగలు, దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ర్టాలు అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ పథకాలపై చింతన్ శివిర్‌లో చర్చిస్తారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల సంక్షేమశాఖల మంత్రులు హాజరుకానున్నారు. దీనిలోభాగంగానే రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.