దేవరుప్పుల, అక్టోబర్ 27: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం వెంకటయ్య హైదరాబాద్లోని ఓ దవాఖానలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు సోదరుడైన వెంకటయ్య చిన్న వయస్సు నుంచి చిందుయక్ష గానంలో అనేక ప్రదర్శనలిచ్చి తనదైన శైలిలో రక్తి కట్టించేవారు. వెంకటయ్య మృతి పై పలువురు ప్రముఖులు, కళాకారులు సంతాపం తెలిపారు.