ఘాటెక్కిస్తున్న పచ్చిమిర్చి ధర.. మరింత పెరుగుతాయంటున్న మార్కెట్ వర్గాలు
ప్రస్తుతం కూరగాయల మార్కెట్లల్లో టమాటా, ఉల్లి ధరలు పడిపోగా, మిర్చి ధర మాత్రం ఘాటెక్కిస్తున్నది. ఇది వరకు కిలో రూ. 80 పలికిన టమాటా, ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా తగ్గాయి.
- పడిపోయిన టమాటా, ఉల్లి రేట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కూరగాయల మార్కెట్లల్లో టమాటా, ఉల్లి ధరలు పడిపోగా, మిర్చి ధర మాత్రం ఘాటెక్కిస్తున్నది. ఇది వరకు కిలో రూ. 80 పలికిన టమాటా, ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా తగ్గాయి. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాలు, పట్టణాల్లోని మార్కెట్లల్లో టమాటా కిలో రూ.20, ఉల్లిపాయలు కిలో రూ.30 వరకు ధరలు ఉన్నాయి.
వ్యాపారులు వినియోగదారులకు టమాటా రూ.20లకు విక్రయిస్తుండగా, రైతులకు మాత్రం రూ.5 కూడా రావడం లేదు. దీంతో టమాటాను మార్కెట్లల్లోకి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కొన్నిచోట్ల రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. ఇక వంటిట్లో అధికంగా వినియోగించే మిర్చి ధరలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మార్కెట్లల్లో నాణ్యత కలిగిన మిర్చి కిలో రూ.80 ఉండగా, రెండోరకం మిర్చి రూ.50 వరకు ధర పలుకుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

