అప్పటి వరకు బడిబాట పట్టిన ఆ చిన్నారులు స్కూల్ వదలగానే పొలంబాట పట్టారు. తమ పంటచేలో అమ్మకు ఆసరగా ఉండాలని నిర్ణయించుచొని చిట్టి చేతులతో.. పత్తి చేనులో మొక్కలకు ఎరువులు వేస్తూ, విత్తనాలు నాటుతూ తల్లికి చేయుతనిచ్చారు. బడితో పాటు సాగుబడి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ సుందర దృశ్యం నారాయణపేట జిల్లా, ఉట్కూర్ మండలం, తిప్రస్పల్లి గ్రామంలో చేటుచేసుకుంది. మరోవైపు తొలకరి పలకరింపుతో రాష్ట్రంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్నుతూ, మెలక చల్లుతూ..నాట్లు వేస్తూ.. సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
మొక్కలకు ఎరువులు వేస్తున్న చిన్నారి..
తల్లికి సాయంగా..