నిర్మల్ అర్బన్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషిచేస్తుండగా పేదల పిల్లలతోపాటు ఉపాధ్యాయుల పిల్లలనూ వాటిలో చేరుతున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చాట్ల శ్రావణ్‌కుమార్ తన కొడుకు పాంచజన్య మిత్రను మోడల్ స్కూల్లో సోమవారం చేర్పించారు.
పాంచజన్యమిత్ర ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో జిల్లాలో ఏడో ర్యాంకు సాధించాడు. అంతేగాకుండా గత ఏడాది హెచ్ఎం శ్రావణ్‌కుమార్ కూతురు ధన్వి సైతం మోడల్ స్కూల్ ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం ధన్వి ఏడో తరగతి చదువుతున్నది. కొడుకు, కూతురు ఇద్దరి కూడా సర్కారు బడికి పంపిన ప్రధానోపాధ్యాయుడిని పలువురు అభినందిస్తున్నారు. ఇతర టీచర్లు కూడా తమ పిల్లలను సర్కారు స్కూళ్లలోనే చేర్పించాలని కోరుతున్నారు.