ధరూరు, డిసెంబర్ 26 : ఇంటి ముందు ఉన్న ఊయల ఊగుతూ ప్రమాదవశాత్తు దూలం విరిగి పడటంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ధరూరు మండలం నాగర్దొడ్డిలో చాకలి వెంకటేశ్ తన ఇంటి వద్ద బట్టలు ఆరబెట్టేందుకు దూలం ఏర్పాటు చేశాడు.
ఆ దూలానికి డ్రిప్పైప్తో ఊయల కట్టాడు. గురువారం అతడి కూతురు సునీత (9) ఊయల ఊగుతుండగా.. ప్రమాదవశాత్తు దూలం విరిగి బాలికపై పడగా అక్కడికక్కడే మృతి చెందింది.