ధర్పల్లి, ఏప్రిల్ 16 : కూతురు గ్రహణ మొర్రితో జన్మించిందనే మానసిక వేదనతో తల్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా మంటలు చిన్నారికి కూడా అంటుకొని ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవింద్‌పల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై వినయ్ కథనం మేరకు.. భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్‌కు చెందిన కీర్తన (25)కు, గోవింద్‌పల్లికి చెందిన ప్రదీప్‌తో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు ఆడపిల్ల లు. ఏడాది క్రితం రెండో కాన్పులో సాన్వి (సంవత్సరం) గ్రహణమొర్రితో జన్మించింది. దీంతో మానసిక వేదనకు గురైన కీర్తన.. బుధవారం తన చిన్న కూతురిని తీసుకొని గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలు పక్కనే బెడ్‌పైకి వ్యాపించడంతో, అక్కడే ఉన్న సాన్వి సైతం మంటల్లో చిక్కుకున్నది. స్థానికులు దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ తల్లి, కూతురు మృతి చెందారు. పోలీ సులు కేసు నమోదు చేశారు.