కౌటాల, జూలై 22: శనగ గింజలు గొంతులో ఇరుక్కొని ఓ నాలుగేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. కనికి గ్రామానికి చెందిన జాడి కల్యాణి-ప్రకాశ్ దంపతులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కౌటాల మండల కేంద్రంలో ఉంటున్నారు. సోమవారం కౌటాల మండల కేంద్రంలో జరిగే వారసంతకు కుమారుడిని తీసుకుకొని వెళ్లారు. శనగ గింజలు కావాలని కొడుకు రిషి కోరడంతో కొనిచ్చారు. అవి తినగా, రిషికి గొంతులో ఇరుక్కొని ఊపిరాడలేదు. మంచిర్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.