నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవాశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ నగర శివారులోని సారంగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి నన్‌కి కుమారి (5) మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులు బబ్లూ (8), జగ్గు(2)కు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల తల్లిదండ్రులు విజయ్ యాదవ్, ధన్వంతరి బాయికి సైతం గాయాలయ్యాయి. బాధిత కుటుంబాన్ని బీహార్‌కి చెందిన పాల వ్యాపారిగా గుర్తించారు. బాధితులను హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.