హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : వేసవి నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామీణ మంచినీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ గ్రామీణా మంచినీటి సరఫరా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. సోమవారం మిషన్ భగీరథ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మౌలిక వసతుల మరమ్మతు, వార్షిక నిర్వహణ పనులపై రోజువారి నివేదిక సమర్పించాలన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా పంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ కార్యనిర్వహక ఇంజినీర్లు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ చీఫ్, కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.