హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు.
భోగభాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలు.. ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సకల జనహితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.