ఇంట్లోనే ఇంత కాలుష్యమా?!
వంటగదిలో నాన్‌స్టిక్ పాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు, డిష్ వాషర్లు కాలుష్యాన్ని కలగజేస్తాయి. నాన్‌స్టిక్ పాన్లపై ఉండే టెఫ్లాన్ కోటింగ్.. వేడెక్కినప్పుడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల సమస్యలను కలిగిస్తుంది. ఇక చాలామంది వేడివేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేస్తుంటారు. మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడిచేస్తుంటారు.
ఇల్లే అత్యంత సురక్షితమైన ప్రదేశం. అనేక రకాలుగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అయితే, ఇంట్లో రోజూవాడే కొన్నిరకాల వస్తువులు.. హానికర రసాయనాలు, టాక్సిన్స్‌తో నిండి ఉంటాయి. ఇంటిని కాలుష్య కారకంగా మార్చేస్తాయి. వంటగది మొదలుకొని పడకగది వరకూ.. ప్రతిచోటా ఇవి తారసపడుతూనే ఉంటాయి.
వంటగదిలో నాన్‌స్టిక్ పాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు, డిష్ వాషర్లు కాలుష్యాన్ని కలగజేస్తాయి. నాన్‌స్టిక్ పాన్లపై ఉండే టెఫ్లాన్ కోటింగ్.. వేడెక్కినప్పుడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల సమస్యలను కలిగిస్తుంది. ఇక చాలామంది వేడివేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేస్తుంటారు. మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడిచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల హానికర రసాయనాలు ఆహారంలోకి చేరుతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. డిష్‌వాష్ బార్స్, లిక్విడ్స్లోని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి.
హాల్లో ఫర్నిచర్ పాలిష్, ఎయిర్ ఫ్రెషనర్లు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. సోఫాలు, కార్పెట్లపై మంటలు అంటుకోకుండా ‘ఫ్లేమ్ రిటార్డెంట్స్’ లాంటి రసాయనాలతో కోటింగ్ చేయిస్తారు. ఇవి మహిళల్లో థైరాయిడ్ సమస్యల్ని కలగజేస్తాయి. ఇక సువాసనల కోసం వాడే ఎయిర్ఫ్రెషనర్లు అనేక అనారోగ్యాలను మోసుకొస్తాయి. తలనొప్పి, గొంతు మంట, ఆస్తమా వంటి సమస్యలను పెంచుతాయి.
పడక గదిలో కాస్మొటిక్స్, డియోడరెంట్స్ ఉపయోగిస్తారు. వీటిల్లో ఉండే రసాయనాలతో చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. పౌడర్లు, క్రీములలో ఉండే పారాబెన్స్, సల్ఫేట్లు హార్మోన్లను దెబ్బతీస్తాయి. బొద్దింకలను తరమడానికి వాడే నాఫ్తలిన్ గోళీలు.. కళ్లకు ఏమాత్రం మంచిదికాదు.
బాత్రూమ్లో వాడే ఫ్లోర్ క్లీనర్లలో అమ్మోనియా, క్లోరిన్ వంటివి వాడుతుంటారు. వీటిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు కలుగుతాయి. ఇక టాయిలెట్ క్లీనర్లు, యాసిడ్ లాంటివి చర్మం, కళ్లపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
ఎలా బయటపడటం?
- ప్లాస్టిక్, నాన్‌స్టిక్ వంట సామగ్రిని పక్కన పెట్టేయండి. స్టీల్, గాజు, సిరామిక్ పాత్రలను ఎంచుకోండి. ఇంటిని, పాత్రలను శుభ్రం చేయడానికి నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడాలను ఉపయోగించండి.
- ఇంట్లోని గాలిని శుభ్రపరిచే స్నేక్‌ప్లాంట్, అలోవెరా లాంటి మొక్కలను పెంచుకోండి.
- ఇవి గాలిలోని టాక్సిన్స్‌ను గ్రహిస్తాయి.
- కిటికీలను తెరిచి ఉంచడం వల్ల.. ఇంట్లోని కలుషిత గాలి బయటికి వెళ్లిపోతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

