హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టులో అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టు 3 నుంచి 10 వరకు వారంపాటు ఆయన పర్యటన కొనసాగనున్నది. ఇందుకోసం ఆయన శుక్రవారం తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయించుకున్నారు.
అయితే అధికారిక పర్యటనా? వ్యక్తిగత పర్యటనా? అనే అంశంపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. పర్యటనలో భాగంగా ఎన్నారై పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారని సమాచారం. దీంతోపాటు కాంగ్రెస్ అనుబంధ ఎన్నారైలతోనూ సమావేశం అవుతారని తెలిసింది.