హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామా ల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచార ణ జరపాలని నిర్ణయించారు.
మెటీరియల్ కొ నుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు, పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో మిషన్ భగీరథ పైప్లై న్ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.