Free Bus | సీఎం గారూ..ఫ్రీ బస్సు తీసేయండి.. కాంగ్రెస్ కార్యకర్త రజిత రిక్వెస్ట్!
Free Bus | ‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.
Free Bus |వేములవాడ, జూలై 13: ‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రావణ్- రజిత దంపతులు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి వేములవాడకు వచ్చారు. సికింద్రాబాద్ చెందిన మరో కుటుంబం కూడా వేములవాడకు వచ్చి మొక్కులు సమర్పించారు. ఇరు కుటుంబాలు సోమవారం తిరుగు ప్రయాణంకోసం తిప్పాపూర్ ఆర్టీసీ బస్‌స్టాండ్ చేరుకున్నారు. సికింద్రాబాద్ బస్సు రాగానే ఎగబడ్డారు.
ఈ క్రమంలోనే సీట్ల కోసం శ్రవణ్-రజిత దంపతులు.. మరో కుటుంబానికి వాగ్వాదం జరిగి, ముష్టియుద్ధానికి దారితీసింది. శ్రావణ్‌పై పిడుగులు గుద్దడమే కాకుండా రజితపై కూడా దాడిచేసి గాయపరిచారు. శ్రావణ్‌కు ముక్కు నుంచి రక్తం కారడంతో పోలీస్ స్టేషన్ చేరుకొని, పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు.
ఈ సందర్భంగా బాధితురాలు రజిత మాట్లాడుతూ.. ఫ్రీ బస్ ద్వారా మహిళల మధ్య గొడవలు చోటుచేసుకుని ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. తాను సీఎం రేవంత్ రెడ్డి అభిమానని, కాంగ్రెస్ కార్యకర్తగా మంత్రి సీతక్కతో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

