CM KCR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. నవంబర్ 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ నామినేషన్లు సమర్పించనున్నారు.
నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీఎం కేసీఆర్. అనంతరం గజ్వేల్లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.