మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్?
మేడారం మహా జాతరలో బాలికపై ఛత్తీస్‌గఢ్ యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగు దాటిన తరువాత అమ్మవార్ల గద్దెల వైపు వెళ్లే దారిలో కుడివైపు ఉన్న మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
- వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఘటన
- అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు ఛత్తీస్‌గఢ్ యువకులు
- ఆలస్యంగా వెలుగులోకి ఘోరం
ములుగు, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం మహా జాతరలో బాలికపై ఛత్తీస్‌గఢ్ యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగు దాటిన తరువాత అమ్మవార్ల గద్దెల వైపు వెళ్లే దారిలో కుడివైపు ఉన్న మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
జాతర సమయంలో చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన బాలిక వాష్‌రూమ్‌కు వెళ్లిన క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్టు సమాచారం. వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. అక్కడ దొరికిన యువకులను పట్టుకొని కుటుంబ సభ్యులు చితకబాదడంతో ఐదుగురిలో కొందరు పరార్ కాగా మరికొందరిని పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది.
ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభుత్వ యంత్రాంగం మేనేజ్ చేసినట్టు సమాచారం. ఘటన జరిగిన తరువాత వందల మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. జాతరలో నిజంగానే బాలికపై లైంగిక దాడి జరిగిందా? జరిగితే అధికారులు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? అసలు కారణాలు ఏమిటి? నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారేనా? అనే విషయాలపై పోలీసులు నిజానిజాలు తేల్చాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

