హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో మన్మోహన్ సింగ్‌ను వాడుకున్నట్టే నేడు ఖర్గేను వాడుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 1995లో కాంగ్రెస్ తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంతో సుప్రీం తీర్పునకు మించి అధికారాలు ఇచ్చారని విమర్శించారు. శీతాకాల సమావేశా ల్లో పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవడం ఖాయమన్నారు. మూసీ నిద్రలో భాగంగా శనివారం సాయంత్రం 4 నుంచి ఆదివారం ఉదయం 9 వరకు బస్తీలో గడపనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు చెప్పారు.