షాబాద్, మే 28: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని అంతారం, షాబాద్, సంకెపల్లిగూడ, నాగరకుంట, హైతాబాద్ గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించనున్నట్లు తెలిపారు. 66 గజాల స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.