Cherlapally Railway Terminal | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను 28న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెర్మినల్ పనులకు రూ.413 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం సకల సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించినట్టు వెల్లడించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాకపోకలు జరుగాల్సి ఉంది.
ప్రత్యేక రైళ్లకు ప్రయాణికులు కరువు
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు భక్తులు, ప్రయాణికులు కరువయ్యారు. దీంతో ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ ప్రకారం మౌలాలి-కొట్టాయం, కొల్లం-మౌలాలి, నర్సాపూర్-కొల్లం, సిర్పూర్కాగజ్నగర్-కొల్లం, కొట్టాయం-సికింద్రాబాద్, హైదరాబాద్-కొట్టాయం వంటి పలు స్టేషన్ల మధ్య ఈ రైళ్ల