హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): టీషర్టులపై జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) చేర్యాల పెయింటింగ్ వేసిన కళాకారులు రాకేశ్, వినయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. రాకేశ్, వినయ్ రూపొందించిన టీషర్టులను శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ ఆవిషరించారు.
ఇలాంటి వినూత్న పద్ధతులతో సంప్రదాయ కళలకు మరింత డిమాండ్ వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటికి ఆన్లైన్ మారెటింగ్, బ్రాండింగ్ అవసరం ఉన్నదని సూచించారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన చేర్యాల పెయింటింగ్ వంటి ఉత్పత్తులకు ప్రచారంతో కళాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు.