Choutuppal | చౌటుప్పల్, సెప్టెంబర్ 30: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కెమికల్ ట్యాంకర్ మంగళవారం రాత్రి బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడ రసాయన పరిశ్రమలోకి కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకరు అదుపు తప్పి రెండుకార్లను ఢీకొట్టింది. ఆ తర్వాత సర్వీస్ రోడ్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. దీంతో అక్కడ పార్క్ చేసిన రెండు వాహనాలు, ఆటోపై పడిపోయింది. దీంతో మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. ట్యాంకర్ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. సంఘటన స్థలానికి హుటాహుటిన ఏసీపీ మధుసూదన్ రెడ్డి, మన్మధ కుమార్, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. కెమికల్ ట్యాంకర్ కావడంతో ముందస్తుగా ఫైర్ ఇంజిన్ను రప్పించారు. తర్వాత క్రేన్ల సహాయంతో వాహనాలను ట్యాంకర్ ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.