సౌరశక్తితోనే కాలుష్యానికి చెక్
తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
- ఎనర్జీ స్వరాజ్ అవగాహన యాత్ర
- ఐఐసీటీలో సోలార్ బస్ ప్రదర్శన
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): తరిగిపోయే ఇంధన వనరులతోనే పర్యావరణానికి ప్రమాదమని, శిలాజ వనరుల పొదుపు, సహజ ఇంధన వినియోగంతోనే కాలుష్యానికి అడ్డుకట్ట వేయొచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇంధన పొదుపు ప్రాముఖ్యతను వివరించేలా ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సోలార్ పవర్ బస్సును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఐఐటీ ముంబైకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సోలంకి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఇంధనంలో 80శాతం శిలాజ ఇంధన ఉత్పత్తులేనని, వీటి వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌజ్ వాయువులు పర్యావరణ మార్పులకు కారణమవుతూ.. మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా రూపొందిస్తున్న విధానాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని అన్నారు. అందుకే కర్బన రహిత ఇంధన వనరుల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎనర్జీ స్వరాజ్ యాత్ర చేస్తున్నదని తెలిపారు. నూటిని నూరు శాతం సౌరశక్తిని వినియోగించేలా ప్రజలను చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర లక్ష్యమని చెప్పారు. ఈ సందర్బంగా ఐఐసీటీ క్యాంపస్ ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలో సోలార్ బస్‌ను ప్రదర్శించారు. సహజ ఇంధన వనరుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

