బంజారాహిల్స్, మే 25: ఉత్తరా ఖండ్‌లోని తెహ్రీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంలో కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కర్‌రావు, సినీ నటుడు తొట్టెంపూడి వేణు తదితరులపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తమను మోసగించారని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.