బోథ్ ఎమ్మెల్యే బాపురావ్‌పై చీటింగ్ కేసు
ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్ల విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎదులాపురం, అక్టోబర్ 18: ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో రెండు ప్లాట్ల విషయమై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ అశోక్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్‌కు బట్టి సావర్గాం సర్వేనంబర్ 53/2లో రెండు ప్లాట్లను 2012లో ఎమ్మెల్యే బాపురావ్, ఆయన భాగస్వామి సుదర్శన్‌లు అమ్మారు. మళ్లీ ఇదే సర్వేనంబర్ గల భూమిని 2019లో సంతోష్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం ఆదిత్య ఖండేష్కర్‌కు తెలిసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రాథోడ్ బావురావ్, సుదర్శన్‌లపై 420, 409, 416, 421, 423 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

