హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఎండీడీఎల్ (మినిమమ్ డ్రా డౌన్ లెవల్)ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్చింది. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని 14 వేల ఎకరాలకు సాగునీటిని అందజేసేందుకు ప్రాజెక్టు ఎండీడీఎల్ను 357.500 నుంచి 355.900గా నిర్ణయిస్తూ మార్పులు చేయాలని కోరుతూ హైదరాబాద్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.