హైదరాబాద్, ఆగస్టు21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ గురుకులాల పనివేళలను మార్చాలని, సమస్యలను పరిషరించాలని గురుకుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సచివాలయంలో జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, కే జనార్దన్, నరసింహులుగౌడ్, గణేష్, భిక్షంయాదవ్ బుధవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఇటీవల మా ర్చిన పనివేళల వల్ల గురుకుల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద యం 8 గంటల నుంచే పనివేళలను ప్రారంభించడం వల్ల విద్యార్థులు సైతం అనేక సమస్యలు ఎదురొంటున్నారని, 9 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు మార్చాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు వెల్లడించారు.
ఇద్దరు విద్యార్థినులను కొరికిన ఎలుకలు
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 21: ఎలుకలు కొరకడంతో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళరం రాత్రి ఈ ఘటన జరిగింది. వానకాలం నేపథ్యంలో పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా మారి విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. పాఠశాల భవనంపై అంతస్తులో విద్యార్థినులు ఉంటుండగా, కింద పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులు ఎం ఇందుశ్రీ, బీ నందినిపై ఎలుకలు దాడిచేసి గాయపర్చాయి. బుధవారం వారిద్దరినీ చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తమ పిల్లలను ఎలుకలు కొరకడంతో విద్యార్థునుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
5 రోజులు వానలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): జార్ఖండ్ పరిసర ప్రాం తాల్లో కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రానున్న 5 రోజు లు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వా తావరణ శాఖ అంచనా వేసింది. హై దరాబాద్, మెదక్, రంగారెడ్డి, యా దాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో మెదక్ జిల్లా చేగుంటలో 8.21 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లిలో 7.58 సెం.మీ, మెదక్ జిల్లా శంకరంపేటలో 7.31 సెం.మీ, తూప్రాన్‌లో 5.09 సెం.మీ, నార్సింగిలో 4.82 సెం.మీ, మనోహరాబాద్‌లో 4.73 సెం.మీ, హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో 6.06 సెం. మీ, మేడ్చల్‌లో 4.84 సెం.మీ, ము నుగోడులో 4.89 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వివరించిం ది. బుధవారం రాష్ట్రంలోని 3 మండలాల్లో అధిక వర్షపాతం, 60 మండలాల్లో మోస్తరు వర్షపాతం, 113 మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.