గురుకులాల టైమ్‌టేబుల్ మార్చండి
గురుకుల పనివేళలను సత్వరం మార్చాలని బీసీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తున్నాయి.
- లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- బీసీ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గురుకుల పనివేళలను సత్వరం మార్చాలని బీసీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ కామన్ టైమ్‌టేబుల్‌ను ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల పనివేళలను ఉదయం 8గంటలకే ప్రారంభించాలని, సాయంత్రం యథావిధిగా 4:30గంటలకు కొనసాగించాలని ఆదేశించింది.
మొత్తంగా గంట సమయాన్ని అదనంగా పెంచింది. అంతేకాదు పాఠ్యప్రణాళికను సైతం సంక్లిష్టంగా, నిరంతరాయంగా నిర్వహించేలా రూపొందించింది. ఉదయం 8:15 గంటల నుంచి మధ్యాహ్నం1:25 వరకు 7 పీరియడ్లను ఏకబిగిన విద్యార్థులకు నిర్వహించాలని నిర్ధేశించింది. అందులో పర్సనల్ సమయం కేవలం 15నిమిషాలు మాత్రమే కేటాయించింది.
క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా, ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా పనివేళలను నిర్ధారించిందని సొసైటీల్లోని గురుకుల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎట్టకేలకు మైనారిటీ, ఇటీవల ఎస్సీ గురుకుల సొసైటీలు కాంగ్రెస్ తెచ్చిన కామన్ టైమ్‌టేబుల్‌ను పక్కకు పెట్టేశాయి. గతంలోని పనివేళలను పాటించడం ప్రారంభించాయి. జనరల్, బీసీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ఇప్పటికీ కామన్ టైమ్ టేబుల్‌ను పాటిస్తున్నాయి. ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కామన్ టైమ్‌టేబుల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

