Gurukula Schools | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల పనివేళల్లో మార్పు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకు అంగీకరించారని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సీఎంను ఆయన నివాసంలో కలిసి గురుకులాల్లో సమస్యలు, టైంటేబుల్ మార్పుపై విన్నవించామని వెల్లడించారు. గతేడాది మాదిరిగా ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, సంఘం బాధ్యులు వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్ ఉన్నారు.