ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 1 : టీఎస్ సెట్-2024 వచ్చే నెల 10 నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లను వచ్చే నెల 2నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు www. te langanaset.org, www. osma nia.ac.inను సంప్రదించాలన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది 8 కాలేజీల కోసం దరఖాస్తు చేయగా ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు ఎల్వోపీ జారీ అయ్యింది. యాదాద్రిభువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తేతెలంగాణ) : వైద్యారోగ్యశాఖలో మరో 3 హెచ్‌వోడీ పోస్టులు రానున్నాయి. ఇన్‌చార్జీలుగా ఉన్న డీపీహెచ్, డీఎంఈ, డీసీఏ, టీవీవీపీ కమిషనర్ పోస్టులను రెగ్యులర్ చేయనున్నట్టు తెలిసింది. డీపీహెచ్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, టీవీవీపీ కమిషన్ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.