హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ వాయిదాపడింది. వాస్తవానికి సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావాల్సి ఉండగా, ఈ నెల 28కి వాయిదావేసినట్టు ఐఐటీ గుహవాటి ప్రకటించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : వోక్సేన్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో ఆదివారం సీఎక్స్‌వో వాంటేజ్ గ్లోబల్ లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహించారు. కాంక్లేవ్‌లో షాపూర్జీ పల్లోంజీ హెచ్ఆర్ హెచ్ అజీజ్ తయ్యబా, ఒప్పో డీజీఎం మిస్టర్ మున్వార్, తదితరులు పాల్గొన్నారు.