హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): చాంద్రాయణ గుట్ట వద్ద 674 మీటర్ల పొడవు, రూ. 45.29కోట్లతో ఇరువైపులా నాలుగు లేన్లతో విస్తరించిన ఫ్లై ఓవర్‌ను శనివారం ఉదయం 11 గంటలకు హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు.
గత మంగళవారమే ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్టు, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదా కానున్నది. స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి.