హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రమ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇటీవల నిర్వహించిన బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన వారిని అభినందించారు.