హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికయింది. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ నేతలు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా మన్నె చంద్రయ్య, సహాధ్యక్షుడిగా వెంకటేశ్‌ను ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.