హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మరో పిటిషన్ కూడా వేశారు. ఈ కేసు ఈ నెల 4న లిస్టయింది. దీనిని జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం విచారించనున్నది. అంతకుముందు రోజే చంద్రబాబు అరెస్టుకు దారితీసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ జరుగనున్నది.