హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విన్నవించారు. నదుల అనుసంధానంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందుతుందని వివరించారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిసిన చంద్రబాబు.. మోదీ 25 ఏండ్ల పాలనా ప్రస్థానంపై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీ రాష్ట్రాభివృద్ధికి చెందిన పలు కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధా ని దృష్టికి తీసుకెళ్లారు. నదుల అనుసంధానంతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని వివరించారు. అనంతరం కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు కలిశారు.