Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. రెండు రోజుల సీఐడీ కస్టడీ, 14 రోజుల రిమాండ్ ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలు నుంచి ఆన్లైన్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన సీఐడీ అధికారులు.. రిమాండ్‌ను పొడిగించాలని కోరారు. దీంతో ఏసీబీ కోర్టు మరో 11 రోజులపాటు కస్టడీ పొడిగించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ కొనసాగనున్నది.