చంద్రబాబు క్షమాపణ చెప్పాలి!.. తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మార్గం: బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉపేంద్ర
టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉపేంద్ర డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ : టీడీపీ మహానాడులో ఆ పార్టీ తెలంగాణ తాత్కాలిక అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలను అవమానించడం దుర్మారమని, వెంటనే తెలం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన నర్సింహులు ముక్కు నేలకు రాయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఉపేంద్ర డిమాండ్ చేశారు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడం సిగ్గుచేటని గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఆయనతో మాట్లాడించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గాలి పీల్చుతూ, వనరులను అనుభవిస్తున్న నర్సింహులుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్ర తెలియకపోవడం అత్యంత దౌర్భాగ్యమని మండిపడ్డారు. మిడిగాణమిడి జ్ఞానంతో చరిత్ర తెలియని నారా లోకేశ్ తెలంగాణలో పార్టీని విస్తరిస్తానని ప్రగల్భాలు పలుకడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెలంగాణలో టీడీపీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో తెలుసుకోవాలని హితవు పలికారు. లోకేశ్, చంద్రబాబులాంటి దుష్టశక్తులు, వారికి మద్దతిస్తున్న తొత్తులపై తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

