రేపటి నుంచి లెక్చరర్ దరఖాస్తుల సవరణకు చాన్స్
లెక్చరర్ దరఖాస్తుల సవరణకు మే 1 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): లెక్చరర్ దరఖాస్తుల సవరణకు మే 1 నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎవరైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు గతేడాది డిసెంబర్ 7న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది.
మల్టీ జోన్-1లో 93, మల్టీ జోన్-2లో 154 పోస్టులు ఉండగా, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యధికంగా 82 లెక్చరర్ ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు ఎడిట్ చేసుకోవాలని సూచించారు. మెయిల్, పోస్టు, నేరుగా వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. అప్లికేషన్లో ఏ అంశాన్నైతే అభ్యర్థులు సవరించారో.. దానికి సంబంధించిన ధ్రువీకరణను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

