మల్యాల, ఏప్రిల్ 1 : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో వేసిన చలువ పందిళ్లు బుధవారం ఉదయం కూలిపోయాయి. కేశఖండనలో ఉన్న భక్తులతో పాటు పలువురు నాయీబ్రాహ్మణులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సోషల్మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్పందించిన ఆలయ అధికారులు నేలకొరిగిన చలువపందిళ్లను సాయంత్రంలోగా సరిచేయించారు.
కొండగట్టు అంజన్న ఆలయంలోని ప్రధాన ఉత్సవ సమయం అయిన హనుమాన్ చిన్నజయంతి ప్రారంభం రోజే చలువ పందిళ్లు నేలకూలడం ఏమిటని, పనుల్లో నాణ్యతాలోపాలు లేకుండా వెంటనే సరిచేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.