హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు సంబంధించిన ‘చలో వరంగల్’ పోస్టర్ను గురువారం ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలోని ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జి వద్ద పోస్టర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకలో పాల్గొంటారని, అలాగే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలోనూ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ మాట్లాడుతూ.. చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రవీందర్ చింతామణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కేసీఆర్ పాలనలో మన రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఇంటి పార్టీని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గ సభ్యులు పరశురామ్ మొతుకుల్ల, రాహుల్ రాంపల్లి, రాజేందర్ ముదిగొండ తదితరులు పాల్గొన్నారు.