10న ఉద్యోగుల గర్జన
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్' నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో గర్జన సభ ఏర్పాటుచేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపనున్నట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
- లక్ష మందితో ఎల్బీ స్టేడియంలో భారీ సభ
- 2 నుంచి 8వరకు జిల్లాల్లో సన్నాహక సదస్సులు
- కార్యాచరణ ప్రకటించిన ఎంప్లాయీస్ జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో గర్జన సభ ఏర్పాటుచేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపనున్నట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంలో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని నేతలు తెలిపారు.
2న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు, హైదరాబాద్ నగర శాఖ సంయుక్త సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 3న ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, 5న ఖమ్మం, వరంగల్, 7న మెదక్, నిజామాబాద్, 8న ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏల విడుదల, రూ.10వేల కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు, హెల్త్‌స్కీమ్ సమర్థవంతంగా అమలు, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు పునరుద్ధరణ తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల గర్జన సభ తలపెట్టినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

