Chairman Vasudeva Reddy | బధిరుల డిగ్రీ కళాశాల ఏర్పాటుపై నివేదికను త్వరగా అందించాలి : చైర్మన్ వాసుదేవరెడ్డి
Chairman Vasudeva Reddy | దివ్యాంగుల ( disabled ) సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ( Chairman Vasudeva reddy ) తెలిపారు.
హైదరాబాద్ : దివ్యాంగుల ( disabled ) సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ( Chairman Vasudeva reddy ) తెలిపారు. సీఎం కేసీఆర్ ( CM KCR ) ఆదేశాల మేరకు బధిరుల డిగ్రీ కళాశాల ( Degree college for Deaf ) ఏర్పాటు కోసం ఖైరతాబాద్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేందర్ ఆధ్వర్యంలో నియమించిన పరిశీలన బృందం మంగళవారం చైర్మన్ వాసుదేవరెడ్డిని కలిసి చర్చించారు. కళాశాల ఏర్పాటు, దాని అవసరం తదితర అంశాలపై చర్చించారు.
ప్రభుత్వానికి వీలైనంత తొందరగా నివేదిక ( Report ) ను అందజేయాలని బృంధం సభ్యులను చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బధిర విద్యార్ధులకు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల లేక పోవడంతో వారు ఉన్నత విద్య కు దూరం అవుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించానని వెల్లడించారు.
స్పందించిన సీఎం వెంటనే కళాశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

