హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పలు శాఖల్లోని ఇంజినీర్ ఉద్యోగాల భర్తీలకు ఈ నెల 22 నుంచి నవంబర్ 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
‘జీవో 28 అభ్యర్థులకు న్యాయం చేయాలి’
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ 2008లో జీవో-28తో నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ట్రైబల్ టీచర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ కోరారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఎంబీబీఎస్‌కు గురుకుల విద్యార్థులు
హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): నీట్ ఎంబీబీఎస్ అడ్మిషన్లలో 174 మంది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యార్థులు సీట్లు కైవసం చేసుకున్నారు. 438 ర్యాంకుతో గాంధీ మెడికల్ కాలేజీలో సాయి వంశీ, 1,791 ర్యాంకుతో హేమంత్, 3,378 ర్యాంకుతో శృతి ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులను ఉపాధ్యాయులు, సొసైటీ కార్యదర్శి వర్షిణి అభినందించారు.