హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : గ్రూపు-4 ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మే 3 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఈ సర్టిఫికెట్ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 పాస్ఫోటోలు తెచ్చుకోవాలని తెలిపింది.