హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): యూఏఈలో సిరామిక్ క్యాస్టర్, ట్రైనీ క్యాస్టర్, జూనియర్ ప్రాసెస్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) దరఖాస్తులు ఆహ్వానించింది. సిరామిక్ క్వాస్టర్ ఉద్యోగాలకు పదోతరగతి, ఆపరేటర్ ఉద్యోగాలకు ఐటీఐ విద్యార్హత ఉండాలని, 18-40 ఏండ్ల మధ్య వయసు ఉన్న ఔత్సాహికులు అర్హులని తెలిపింది.
ఆసక్తిగలవారు ఈనెల 24, 25న హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని టామ్‌కామ్ ఆఫీస్‌లో నిర్వహించే ఇంటర్యూలకు హాజరు కావాలని సీఈవో కోరారు.