హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సీఈవో దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారంపై జిల్లాల కలెక్టర్లతో సీఈవో సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లు, వెబ్‌కాస్టింగ్, మైక్రోఅబ్జర్వర్ల నియామకం తదితర అంశాలపై వివరించారు. మార్గదర్శకాలు విడుదల చేశారు. సమావేశంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.