హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల కమిషన్ మీడియా సెంటర్‌ను బీఆర్కేఆర్ భవన్లో శనివారం సీఈవో వికాస్‌రాజ్ ప్రారంభించనున్నారు. రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతారు.
ఎన్నికల సంఘం మీడియాకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు దీనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.