హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో మోదీ సర్కారు ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందో ఏమో కానీ.. రైతుల పాలిట శాపంగా మారింది. 2014లో మోదీ సర్కారు రానంతవరకూ దేశంలో ధాన్యం సేకరణ సమస్య కాలేదు. రైతుల నుంచి ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఎఫ్‌సీఐకి తగిన సిబ్బంది లేరని, సరైన వ్యవస్థ లేదన్న కారణాలతో.. మేం డబ్బులిస్తాం.. ఖ ర్చులు భరిస్తాం.. ధాన్యం సేకరించి బియ్యం చేసి ఎఫ్‌సీఐకి కాస్త అప్పగించండంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర సర్కారు బతిమాలింది. ఫెసిలిటేట్ చేయడమే కదా అని రాష్ట్ర ప్రభుత్వాలూ అందుకు ఒప్పుకొన్నా యి. ఇప్పుడదే పాపంగా మారిపోయింది. ఇప్పుడు ధాన్యం సేకరణ బాధ్యతంతా రాష్ర్టాలదేనని కేంద్రం కుండబద్దలు కొట్టింది. దీని వెనుక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎఫ్‌సీఐని మూసివేయాలన్న కుట్ర దాగి ఉన్నదా? ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజానీకానికి అందించే రేషన్ బియ్యానికి మంగళం పాడాలన్న యోచన కేంద్రం చేస్తున్నదా? అన్న ప్రశ్నలకు ఔననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ర్టాలపై డీసీపీ రుద్దుడు..
2014కు ముందు రాష్ట్రంలో కేంద్రం తరఫున భా రత ఆహార సంస్థ నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది. ఇందుకోసం ఎఫ్‌సీఐ నేరుగా మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకొనేది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉండేది కాదు. కానీ రాష్ర్టాల్లో ఎఫ్‌సీఐకి సరైన సౌకర్యాలు, తగిన సిబ్బంది లేకపోవడంతో ధాన్యం సేకరణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు సహకరించాల్సిందిగా రాష్ర్టాలను కేం ద్రం బతిమాలింది (ప్రస్తుతం సీసీఐ పత్తిని కొంటున్నట్టుగా). కొన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం రూ పంలో ఇవ్వాలని కోరింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2012లో డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టం (డీసీపీ)కు అంగీకరించినప్పటికీ పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. 2014లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సయోధ్య వాతావరణం కోసం తెలంగాణ ప్రభుత్వంసంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేస్తూ వచ్చింది. అంతే తప్ప ఇందుకోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చ లు జరుపలేదు.. మంచి సంబంధాలకోసం తెలంగాణ ఉదారంగా వ్యవహరిస్తే.. ఈ పేరుతో ధాన్యం కొనే బా ధ్యతనుంచి కేంద్రం తప్పించుకొన్నది. ఇప్పుడేమో.. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు.. ధాన్యం సేకరణ బాధ్యత రాష్ర్టానిదేనంటూ గుడ్డిగా ప్రచారం చేస్తున్నారు.
కేంద్రం సేఫ్.. రాష్ట్రం బేర్
కేంద్రం డీసీపీ విధానం తెచ్చి సేఫ్‌సైడ్‌లో నిలిచిం ది. రాష్ర్టాలకు ఈ విధానం గుదిబండగా మారింది. గతంలో సహకరిస్తామని ముచ్చట్లు చెప్పిన కేంద్రం ఇప్పుడేమో సవాలక్ష కొర్రీలు పెడుతూ నిబంధనల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. ధాన్యం కొనుగోలు కోసం రాష్ర్టాలకు ముందుగా నిధులివ్వాల్సిన కేంద్రం.. బాధ్యత మరిచి బియ్యం డెలివరీ చేసి న తర్వాతే బిల్లులు చెల్లిస్తున్నది. దీంతో రాష్ర్టాలు ముందుగా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రైతులకు ధాన్యం పైసలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎఫ్‌సీఐ మూత.. రేషన్ బియ్యంకు కోత ?
లక్షల మంది రైతులు, కోట్ల మంది ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు, రేషన్ బి య్యం పంపిణీ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదని ప్రస్తుత ధోరణి చెప్తున్నది. ఎఫ్‌సీఐను మూసివేసే కుట్ర చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎఫ్‌సీఐ మూతపడితే పేదల ఆకలి తీర్చుతు న్న ప్రజా పంపిణీ వ్యవస్థ మూతపడుతుంది. అంటే పేదలకు ఇప్పుడు అందుతున్న రేషన్ పంపిణీ జరుగదు. కేంద్రం ధాన్యం కొనుగోలులో సృష్టిస్తున్న ఈ సమస్యలన్నీ భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ మూసివేతకు, రేషన్ బియ్యం కోతకు బాటవేస్తున్నాయి.
బాయిల్డ్‌రైస్‌ను ప్రోత్సహించిందెవరు?
కేంద్రం తాజాగా సృష్టించిన వివాదంలో రా రైస్, బాయిల్డ్ రైస్ సేకరణ ప్రధానమైంది. డీసీపీ అమలు సమయంలో రా రైస్, బాయిల్డ్ రైస్ ప్ర స్తావన ఎక్కడా లేదు. ఇప్పుడేమో.. తమకు రా రైసే కావాలి లేదా బాయిల్డ్ రైస్ మాత్రమే కావా లి.. తాము అడిగింది ఇస్తేనే తీసుకొంటామంటూ కొత్త కొర్రీలు పెడుతున్నది. విచిత్రమేమంటే మొ దట్లో ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి రా రైస్‌నే సేకరించేది. దేశ వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ వినియోగం పెరగటంతో బాయిల్డ్ మిల్లులను ప్రోత్సహించి రా రైస్‌ను తగ్గించి బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తీసుకొన్నది. ఇందుకోసం మిల్లుల కన్వర్షన్‌కు 15 శాతం సబ్సిడీ కూడా ఇచ్చి పార్బాయిల్డ్ రైస్ మిల్లులను ప్రోత్సహించింది. ఇప్పుడేమో మళ్లీ బాయిల్డ్ రైస్ వద్దని, రా రైస్ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తున్నది. ప్రస్తుత సమస్యకు చెక్ పడాలంటే గ తంలో మాదిరిగా కేంద్రమే రైతులనుంచి నేరుగా ధాన్యం కొంటే సరిపోతుంది. కేంద్రం సేకరించిన ధాన్యాన్ని ఏ విధంగా మార్చుకొంటారన్నది వారి ష్టం. రాష్ట్రంతో సంబంధం లేకుండా వారికి నచ్చి న విధంగా చేసుకోవచ్చు. అప్పుడు బాయిల్డ్‌రైస్ మిల్లులను ఎట్లాగైతే ప్రోత్సహించారో.. ఇప్పుడు రా రైస్ మిల్లులను తిరిగి ప్రోత్సహించుకోవచ్చు.
రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు
1. ఏదైనా రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ పెట్టాలం టే ఆ రాష్ర్టాన్ని కేంద్రం సంప్రదించిన తర్వా త గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్థాపించవచ్చు.
2. సబ్‌సెక్షన్ (1) ప్రకారం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ అనేది కార్పొరేట్ బాడీ అన్నట్టు. ఆస్తిని పొందడం.. కలిగి ఉండటం.. విక్రయించే అధికారాలు కలిగి ఉంటుంది. కాంట్రాక్టుల్లో కూడా పేరును పొందుపరచవచ్చు. కార్పొరేషన్‌పై వ్యాజ్యం వేయొచ్చు కూడా.
3. సదరు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొన్న ప్రాంతంలో కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంటుంది.
4.కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ అప్పజెప్పిన పనులు రాష్ట్ర పుడ్ కార్పొరేషన్ చేయాల్సి ఉంటుంది.
వాస్తవంగా ఎఫ్‌సీఐ ఏర్పాటుచేసినప్పుడు అందుకు చేసిన చట్టంలో ఉన్న ప్రధానాంశాలేమిటి?ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టం-1964 సెక్షన్ 13
1. చట్టంలోని ఈ నిబంధన ప్రకారం.. ధాన్యం, ఇతర ఆహార పదార్థాల కొనుగోలు, నిల్వ, తరలింపు, రవాణా, పంపిణీ, అమ్మకాల ప్రాథమిక బాధ్యత కార్పొరేషన్‌దే.
2. కేంద్రం ముందస్తు అనుమతితో కార్పొరేషన్..
a. ధాన్యం, ఆహార పదార్థాల ఉత్పత్తి వృద్ధిని ప్రమోట్ చేయొచ్చు.
b. ధాన్యం, ఇతర ఆహారపదార్థాలను ప్రాసెసింగ్ చేసేందుకు రైస్ మిల్లులు, ఫ్లోర్ మిల్లులు, ఇతర మిల్లులను ఏర్పాటు చేయడం లేదా ఏర్పాటు చేసేందుకు సాయం అందించవచ్చు.
c. ఈ చట్టం కింద సంక్రమించిన హక్కులు లేదా బాధ్యతల ప్రకారం కార్పొరేషన్ తన కర్తవ్యాలను నెరవేర్చవచ్చు.