హైదరాబాద్ : ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్‌ను, ఐసీయూను, లేబర్ రూంను ప్రారంభింన అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌ను ఉచితంగా ఇవ్వాలని కేంద్ర మంత్రికి స్వయంగా తానే లేఖ రాశానని హరీశ్‌రావు గుర్తు చేశారు. 18 నుంచి 59 ఏండ్ల వయసు మధ్య వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వాలన్నారు. దీనికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో మరోసారి కేంద్రానికి లేఖ రాసి, సంప్రదింపులు జరుపుతామన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు ఉచితంగా బూస్టర్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.